గుత్తి బీరకాయ

బీరపాదు కాయలు కాయడం మొదలుపెట్టింది.ఈరోజు ఒక బీరకాయ కోసాను.ఒక్క బీరకాయతో ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే,నూనె వంకాయలాగా చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది.చేశాక బాగా కుదిరింది.

కావలసిన పదార్థాలు
బీరకాయ – 1
ఉల్లిపాయ – 1చిన్నది
టమాటా – 1 చిన్నది
చనిక్కాయలు (వేరుశనగ గుళ్ళు) – 2 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
నల్ల నువ్వులు – 1 టెబుల్ స్పూన్
ఎండు కొబ్బరి – కొంచెం
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి పాయలు – 4-5
కారం -తగినంత
పసుపు – కొద్దిగా
గరంమసాలా పొడి – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు

img_2653 (1)

పొయ్యి వెలిగించి,మందపాటి పాత్రలో నూనె లేకుండా చనిక్కాయలు వేయించాలి.చనిక్కాయలు సగం వేగాక ధనియాలు,నువ్వులు కూడా వేయాలి.ఇవన్నీ వేగాక ఎండుకొబ్బరి కూడా వేసి దింపెయ్యాలి.

img_2654 (1)

ఇవన్నీ చల్లారాక చింతపండు,కారం,ఉప్పు,గరంమసాలా పొడి కూడా వేసి పొడి చేసుకోవాలి.

 

img_2655 (1)

img_2656 (1)ఈ పొడిలోనే ఉల్లిపాయ ముక్కలు,టమాటా ముక్కలు,అల్లం,వెల్లుల్లి,పసుపు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా నూరుకోవాలి.

img_2657 (1)

ఇప్పుడు బీరకాయ చెక్కుతీసి,వేలెడు ముక్కలుగా తరుక్కోవాలి.ఈ ముక్కల్ని నాలుగు ముక్కలుగా విడిపోకుండా గుత్తిలాగా వచ్చేలా కోసుకోవాలి.ఈ గుత్తిలోకి నూరి పెట్టుకున్న మసాలా కూరుకోవాలి.

img_2658 (1)

బీరకాయలు కొద్దిగా మగ్గాక నూరిపెట్టుకున్న మసాలాలో తగినంత నీళ్ళుపోసి,ఉడుకుతున్న బీరకాయ ముక్కల్లో పోయాలి.

img_2659 (1)

img_2660 (1)బీరకాయ ముక్కలు బాగా ఉడికి,గ్రేవీ దగ్గర పడ్డాక దింపెయ్యాలి.

 

img_2661 (1)వేడి వేడి అన్నంలోకి కానీ,చపాతీ,రొట్టెల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.

 

6 thoughts on “గుత్తి బీరకాయ

  1. నా చిన్నప్పుడు మా అమ్మ కేరెట్ సైజు బీరకాయలను పొట్టు తీసి, మసాలా పెట్టి గుత్తి వంకాయలా వండేది-బాగుండేవి. ఆ సైజు బీరకాయలు మర్కెట్ లొ దొరకటం కష్టం అవటం వలన ప్రయత్నించలేదు. మీరు చూపించిన గుత్తి బీరకాయ విధానం బాగుంది – ప్రయత్నించాం రుచిగా కూడా ఉంది. తెలియజేసినందుకు ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి