వెజిటబుల్ నూడిల్స్

నూడిల్స్ అంటే ఇష్టపడని పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ నూడిల్స్ తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.కొన్న వాటి కంటే ఆరోగ్యకరం కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పైగా మనకు ఇష్టం వచ్చిన పిండితో చేసుకోవచ్చు. వీటిని నేను బార్లీ పిండితో చేశాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు.

 

img_4961

కావలసిన పదార్థాలు:-
బార్లీ పిండి – మూడు కప్పులు
కూరగాయల ముక్కలు – 2-3 కప్పులు
వెల్లుల్లి – 2-3 రెబ్బలు
అల్లం – చిన్న ముక్క
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నీళ్ళు – సరిపడా
నూనె – 3-4 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – తినే కారానికి సరిపడా

img_4942

 

img_4943

పొయ్యి మీద మంచి నీళ్ళు పెట్టి బాగా మరిగించాలి.

img_4941

IMG_3793

బార్లీ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి.

IMG_2430కారాల పావుల్లో (జంతికల గొట్టం) ఈ పిండిని తీసుకొని నూడిల్స్ లాగా, ఇడ్లీ పాత్రల్లోకి వత్తుకోవాలి.

 

img_4946

పిండి అంతా వత్తుకున్నాక, ఇడ్లీ ఉడికించినట్లు ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించాలి.

 

img_4947

img_4949

 

10 నిమిషాల తర్వాత వెడల్పాటి పళ్ళెంలో విడి విడిగా తీసి చల్లారనివ్వాలి.

img_4951

కూరగాయలు సన్నగా తరుక్కోవాలి. నేను క్యారెట్, క్యాబేజ్, ఉల్లిపాయలు వేశాను. అల్లం, వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.

img_4953

సోయా సాస్, టొమాటో సాస్ రెండు ఒక చిన్న గిన్నెలో కలిపి ఉంచుకోవాలి.

img_4955

పొయ్యి మీద మందపాటి పాత్ర పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.

img_4956

వేగాక కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్ది సేపు మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలు మరీ మెత్తగా మగ్గకుండా చూసుకోవాలి.

img_4957

img_4958

ఇప్పుడు సాస్ పోసి బాగా కలపాలి.

img_4959

చల్లారపెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి పెద్ద మంట మీద బాగా కలపాలి.

img_4960

చివరలో అప్పుడే దంచిన మిరియాల పొడి వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది.

వాడప్పం

ఈ వంటకం నేను చిన్నప్పుడు మాకు తెలిసినవాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకునేవాళ్ళు.వాళ్ళది రాయలసీమలో కర్ణాటక సరిహద్దు ప్రాంతం. కర్ణాటకలో చేసుకునే వంటకం కావచ్చు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రయత్నించి చూద్దాం అనిపించి చేశాను.

img_4934

కావలసిన పదార్థాలు :-
బియ్యప్పిండి(కడిగి ఆరబెట్టి పిండి కొట్టించినది) – 1 కప్పు
జీలకఱ్ఱ – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా

 

img_4925

పొయ్యి మీద మందపాటి పాత్రలో అరకప్పు నీళ్ళు ఉప్పు వేసి మరిగించాలి.మరిగాక బియ్యప్పిండి,జీలకఱ్ఱ వేసి బాగా కలపాలి.

img_4929

తరువాత పొయ్యి ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారాక కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి బాగా మర్థించాలి.

img_4930

ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగ చేసుకుని పూరీల్లాగ వత్తుకోవాలి.వత్తుకోవడానికి కఱ్ఱతో లేక పూరీ ప్రెస్ కానీ వాడచ్చు.

 

img_4933

 

img_4932

పిండి అంతా పూరీల్లాగా వత్తుకున్నాక, బాణలిలో నూనె పెట్టి నూనె వేడెక్కాక పూరీల్లాగా వేయించుకోవాలి.

ఆవిరి ఉండలు

ఆవిరి ఉండలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తయారు చేయడం కూడా చాలా సులువు. బియ్యం పిండి,జొన్న పిండి, బార్లీ పిండి ఇలా ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను వీటిని బియ్యం పిండితో చేశాను.

img_4872 (1)

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి – 3 కప్పులు
నీళ్ళు – తగినన్ని
ఉప్పు,కారం – తగినంత
పోపుకు
ఆవాలు
జీలకఱ్ఱ
శనగపప్పు
కరివేపాకు
ఇంగువ
ఎండుమిరపకాయలు
నూనె

పొయ్యి మీద నీళ్ళు పెట్టి బాగా మరిగాక, పిండిలో వేసి బాగా కలపాలి.

Photos 456ఈ కలిపిన పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి.

IMG_4858ఈ ఉండల్ని ఇడ్లీ పాత్రలో వేసి 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

img_4861 (1)

ఉడికిన ఉండల్ని తీసి పక్కన పెట్టుకోవాలి

IMG_4864 IMG_4865పొయ్యిమీద మందపాటి పాత్రలో కొద్దిగా నూనె వేసి, వేడెక్కాక పోపు సామాను వేసుకోవాలి.

img_4866 (1)

పోపు వేగాక ఉడికించిన ఉండలు కూడా వేసి బాగా వేయించాలి.

img_4867 (1)

ఈ ఉండలు బాగా వేగాక ఉప్పు,కారం వేసి కలిపి కొద్దిసేపు ఉంచి, దింపేస్తె సరిపోతుంది.

 

img_4868 (1)

img_4869 (1)

అల్లం మురబ్బా

ఈ అల్లం మురబ్బా నా చిన్నప్పటి నుండి బజార్లో అమ్ముతుండగా చూస్తునే ఉన్నాను. ఒక్కసారైనా ప్రయత్నించి చూడాలన్న కోరిక ఉండేది. ఈరోజు చేసేశాను. అల్లం ఘాటు ఇష్టపడేవాళ్ళకు నచ్చుతుంది.

 

img_4686 (1)

కావలసిన పదార్థాలు
అల్లం ముద్ద – 1 కప్పు
బెల్లం – 2 కప్పులు
చక్కెర – 1 కప్పు
నెయ్యి కొద్దిగా

అల్లం ముక్కలు శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

img_46711 (1)
ఈ ముక్కల్ని మిక్సీ జార్‌లో వేసి ముద్దగా చేసుకోవాలి.

img_4672 (1)

ఒక మందపాటి పాత్రలో బెల్లం,చక్కెర వేసి, కొద్దిగా నీళ్ళు పోసి వేడిచేయాలి.

img_4674 (1)

తీగ పాకం వచ్చాక అల్లం ముద్ద వేసి బాగా కలుపుతూ ఉండాలి.ఒక పళ్ళానికి నెయ్యి రాసి ఉంచుకోవాలి.

img_4676 (1)

img_4677 (1)

 

 

అల్లం ముద్ద బాగా దగ్గర పడ్డాక దింపేసి, నెయ్యి రాసి ఉంచిన పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి.

img_4679 (1)

img_4680 (1)

 

 

బాగా చల్లారాక ముక్కలుగా కోసి దాచుకోవచ్చు.

img_4682 (1)

 

మునగాకు అన్నం

తీరిక దొరకకపోవడం వల్ల బ్లాగు వైపు చూసి చాలా నెలలైంది. రాయాలన్న ఉత్సాహం కూడా తగ్గిపోయింది.ఎట్టకేలకు బద్దకాన్ని వదిలించుకుని తిరిగి రాయాలన్ననిర్ణయం తీసుకున్నాను.

మునగాకులో చాలా పోషకవిలువలున్నాయి. బజార్లో దొరికే పురుగుమందులు వేసి అమ్ముతున్నఆకుకూరల కంటే పురుగు మందుల అవసరం లేకుండా పెరిగే ఇలాంటి ఆకుకూరల వాడకం పెంచుకోవడం మంచిది.ఈ మునగాకు అన్నం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.

img_4669 (1)

 

కావలసిన పదార్థాలు
రెండు కప్పుల బియ్యంతో వండి చల్లార్చి పెట్టుకున్న అన్నం
వలిచి పెట్టుకున్న మునగాకు – రెండు కప్పులు
ఉల్లిపాయ – 1 పెద్దది
పచ్చి మిరపకాయలు – 3 (తినే కారాన్ని బట్టి)
వెల్లుల్లి – 4 (ఇష్టమైతే వేసుకోవచ్చు)
చింతపండు – చిన్న నిమ్మకాయంత (ఇష్టమైతే వేసుకోవచ్చు)
నూనె – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినత

పోపుకు
ఆవాలు,జీలకర్ర,ఎండుమిరపకాయ,వేరుశనగగుళ్ళు కొద్దిగా
నూనె – 2 టేబుల్ స్పూన్లు

అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి.మునగాకు వలుచుకుని శుభ్రం చేసి పెట్టుకోవాలి.

img_4652 (1)

బాణలిలో నూనె వేసి అందులో సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. వెల్లుల్లి ఇష్టపడేవాళ్ళు వెల్లులి కూడా వేసుకోవచ్చు.

img_4656 (1)వేగాక శుభ్రం చేసిపెట్టుకున్న మునగాకు వేసి మగ్గించాలి.చింతపండు వేసుకునేవాళ్ళు చింతపండు వేసుకోవచ్చు.

img_4657 (1)మునగాకు బాగా మగ్గిపోయాక పొయ్యి మీద నుండి దించి చల్లార్చుకోవాలి.

img_4658 (1)బాగా చల్లరి పోయాక మిక్సీ జార్ లో వేసి, తగినంత ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా నూరుకోవాలి.

img_4661 (1)పొయ్యి మీద బాణలి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకఱ్ర,శనగపప్పు,వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు వేసి పోపు వేసుకోవాలి.పోపు వేగాక దింపెయ్యాలి.

img_4662 (1)చల్లార్చి పెట్టుకున్న అన్నంలో నూరి పెట్టుకున్న మునగాకు ముద్ద వేసి బాగా కలుపుకోవాలి.

img_4663 (1)ఈ అన్నంలోకి పోపు కూడా వేసి బాగా కలిపేసుకుంటే మునగాకు అన్నం తయారయినట్టే.

 

img_4664 (1)

బీట్‌రూట్ ఐస్‌ఫ్రూట్ బార్స్

మా పిల్లలకు నెలకొకసారి ఐస్‌క్రీంలు కొనిపెట్టేవాళ్ళం.వాళ్ళకేమో ఐస్‌క్రీముల కంటే ఐస్‌ఫ్రూట్ బార్స్ చాలా ఇష్టం.బయట ఎంత ప్రయత్నించినా వాళ్ళకు నచ్చినవి దొరకకపోతే, బయట కొనడం వద్దు,నువ్వే ఇంట్లో చేసి పెట్టు అని ఆ బాధ్యత నామీదే పెట్టేశారు.చలికాలం వచ్చింది కదా అని నేను చేయడం మానేశాను.కానీ వాళ్ళు మాత్రం మర్చిపోలేదు.రోజూ గుర్తు చేస్తూనే ఉన్నారు.ఇక వాయిదా వేయడం కుదరదు అని అర్థం అయ్యింది.ఈ సారి దేనితో చేద్దాం, అని ఫ్రిడ్జ్‌లో చూస్తుంటే బీటి్‌రూట్ కనపడ్డాయి.అంతే బీట్‌రూట్‌తో ప్రయోగం చేద్దామని చేసేశాను.భలే మంచి రంగుతో బాగా వచ్చింది.

img_4277 (1)బీటి్‌రూట్ తురుము జ్యూసర్‌లో వేసి రసం తీశాను.బీట్‌రూట్‌లో సహజంగానే తీపి ఉంటుంది అందుకని చక్కెర ఎక్కువ అవసరం లేదు.1-2 టీ స్పూన్ల చక్కెర వేసుకుంటే సరిపోతుంది.ఈ రసాన్ని ఐస్‌ఫ్రూట్ మౌల్డ్‌లో వేసి గట్టిపడే వరకు ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుంది.

img_4253 (1)

అల్లం టీ

అల్లం వల్ల చాలా ఉపయోగాలున్నాయి.ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుగు,దగ్గు వంటి వాటినుండి ఉపశమనం పొందడానికి ఈ అల్లం టీ చాలా ఉపయోగపడుతుంది.అల్లం ఉపయోగాల గురించి ఇక్కడ చదవండి.

img_4273 (1)ఎన్ని కప్పుల టీ కావాలనుకుంటే అన్ని కప్పుల నీళ్ళు మరిగించాలి.నేను 3 కప్పుల నీళ్ళు తీసుకున్నాను.

img_4942

సన్నగా తరిగిన అల్లం ఒక టీ స్పూన్ నీళ్ళు మరుగుతున్నప్పుడు వేయాలి.అల్లం తో పాటు చిన్న బెల్లం ముక్క కూడా వేసి మూతపెట్టి,సింలో 10-15 నిమిషాలు మరిగించాలి.

img_4270 (1)

బెల్లం ఇష్టపడని వాళ్ళు తగినత చక్కెర వేసుకోవచ్చు.ఈ రెండూ వాడని వాళ్ళు దింపేశాక తేనె కలుపుకోవచ్చు.బాగా మరిగిన తర్వాత వడకట్టి తాగేయ్యెచ్చు.

img_4271 (1)

(ఎండు)చింతచిగురు పులిహోర

చింతచిగురు దొరికే కాలంలో రోజూ ఒకతను పక్క పల్లెటూరు నుండి చింతచిగురు కోసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి అమ్మేవాడు.పప్పో,పచ్చడో చేసుకోవచ్చు కదా అని కొన్నిసార్లు,ఇంటి వరకు వచ్చేశాడు కదా వద్దనడం ఎందుకు అని కొన్ని సార్లు,ఇలా రోజు కొనేదాన్ని.ఎక్కువ అనిపిస్తే నీడలో ఆరబెట్టి ఎండాకా జాగ్రత్తచేసేదాన్ని.అలా ఎండబెట్టిన చింతచిగురు ఈరోజు కనపడగానే దీనితో పులిహోర చేద్దామన్న ఆలోచన వచ్చింది.వెంటనే ప్రయోగం చేసేశాను.

img_4267 (1)కావలసిన పదార్థాలు
3 కప్పుల బియ్యంతో వండిన అన్నం
ఎండబెట్టిన చింత చిగురు – 1 కప్పు
నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
పచ్చి మిరపకాయలు – 2(తినే కారానికి తగినన్ని)
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
పోపుకి
నూనె – 3 టేబుల్ స్పూన్లు
శనగపప్పు,మినప్పపు,చనిక్కాయలు,ఎండుమిరపకాయలు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు
మూకుడులో నూనె లేకుండా చింత చిగురు వేయించుకోవాలి.

photos-442 (1)వేగాక తీసి పక్కన ఉంచి,అదే మూకుడులో నువ్వులు వేయించుకోవాలి.

photos-444 (1)రెండూ చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి.

img_4256 (1)నూనె పోసి,నూనె వేడెక్కాక,ఆవాలు,జీలకర్ర,శనగపప్పు,మినప్పప్పు,చనిక్కాయలు,ఎండు మిరపకాయ,కరివేపాకు వేసి వేయించాలి.

img_4257 (1)

వేగాక దింపే ముందు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి.

img_4258 (1)చల్లార్చి పెట్టుకున్న అన్నంలో,వేయించిన పోపు,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

img_4261 (1)చివరగా చింతచిగురు-నువ్వుల పొడి కూడా వేసి కలిపితే సరిపోతుంది.

img_4263 (1)

పెసరపప్పు ఇడ్లీ

బియ్యం తినకూడని సందర్భాల్లోనూ,పిండి పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండే మధుమేహవ్యాధిగ్రస్తులకు,పిండిపదార్థాలు తగ్గించి మాంసకృత్తులు(ప్రోటీన్స్)ఎక్కువగా తీసుకోవాలనుకునేవాళ్ళకు ఈ ఇడ్లీ సరిగ్గా సరిపోతుంది.కొత్త రుచులు కోరుకునేవాళ్ళు ప్రయత్నించి చూడవచ్చు.వేడిగా తింటే రుచిగా ఉంటుంది.చల్లారితే గట్టిపడిపోతాయి.

img_4251 (1)కావలసిన పదార్థాలు
పెసరపప్పు(పొట్టులేనిది) – 1 కప్పు
మినప్పప్పు – 1 కప్పు
మెంతులు – 1 టీ స్పూన్

మినప్పప్పు,పెసరపప్పు,మెంతులు 4-5 గంటలు నానబెట్టి,మెత్తగా రుబ్బుకోవాలి.రుబ్బిన పిండిని పులియనివ్వాలి.రాత్రంతా పులియనక్కర్లేదు,5-6 గంటలు పులిస్తే సరిపోతుంది.పులిసిన పిండిలో తగినంత ఉప్పేసి,ఇడ్లీ ప్లేట్లలో వేసి 10-15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

img_4238 (1)

img_4240 (1)దింపేసిన వెంటనే కాకుండా,5 నిమిషాలు చల్లారనిచ్చి తీస్తే ఇడ్లీలు ప్లేట్లకు అంటుకోకుండా వస్తాయి.

ఇడ్లీ వేశాక పిండి కొంచెం మిగిలితే దోశ వేశాను.ఇడ్లీ కంటే కూడా దోశ చాలా రుచిగా వచ్చింది.కొన్ని రకాల దోశల ప్రయోగాలు చేయాలన్న ఆలోచన వచ్చింది.

క్యాబేజ్ పచ్చడి

ఈ పచ్చడిని ఆరోగ్యకరమైన పచ్చళ్ళ జాబితాలో చేర్చుకోవచ్చు.ఇందులో నూనె,చింతపండు లాంటివి ఏవీ వాడలేదు.పులుపు ఇష్టపడేవాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు.రుచి చాలా బాగుంది.తక్కువ సమయంలోనే తయారుచేసుకోవచ్చు.

IMG_3953కావలసిన పదార్థాలు
క్యాబేజ్ – చిన్న ముక్క
పచ్చికొబ్బరి తురుము – అరకప్పు
కొత్తిమీర – చిన్న కట్ట
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
చనిక్కాయలు(వేరుశనగగుళ్ళు) – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిరపకాయలు – 2(తినే కారానికి తగినన్ని)
ఉప్పు – తగినంత
పొయ్యి వెలిగించి మూకుడులో నూనె లేకుండా నువ్వులు వేయించి పెట్టుకోవాలి.

img_3948 (1)నువ్వులు వేగాక,చనిక్కాయలు కూడా వేయించి ఉంచుకోవాలి.ఈ రెండూ చల్లారాక మిక్సీలో పొడి చేసుకుని ఉంచుకోవాలి.

img_39491 (1)కుక్కర్లో ఆవిరిమీద ఉడికించడానికి అనువుగా పాత్రను సిద్దం చేసుకోవాలి.ఇందులో ముందుగా మిరపకాయలు వేసుకోవాలి.

img_3943 (1)

తరువాత కొత్తిమీర తరుగు వేసుకోవాలి.

img_3944 (1)

చివరగా సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి.

img_3945 (1)

దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి.నేను కింద స్టాండ్‌లాగా ఉన్న చిల్లుల గిన్నెలో వేసి కుక్కర్లో ఇడ్లీ ఉడికించినట్లు ఉడికించాను.

img_3946 (1)

8 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

img_3947 (1)

చల్లారాక ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

img_3950 (1)

ఈ ముద్దలో కొబ్బరి తురుము వేసి ఇంకొక్కసారి మెత్తగా రుబ్బాలి.

img_3951 (1)

చివరగా నువ్వులు-చనిక్కాయల పొడి వేసి కలిపేసుకుంటే సరిపోతుంది.పులుపు కావలసినవాళ్ళు తగినంత నిమ్మరసం కలుపుకోవచ్చు.

img_3952 (1)