మందారపువ్వులతో నూనె

హెర్బల్ షాంపూలానే తలకు రాసుకునే నూనె కూడా మందారపువ్వులు,కరివేపాకు,గోరింటాకులతో తయారుచేసుకోవచ్చు.ఇవేవీ అందుబాటులో లేనప్పుడు ఉట్టి కరివేపాకుతో అయినా చేసుకోవచ్చు.నాకు తెలిసిన ఒకరిని నా చిన్నప్పటినుండి చూస్తున్నా.ఆవిడ బద్దకించకుండా ప్రతివారం కరివేపాకులతో నూనె కాచుకుని తలకు రాసుకుంటుంది.దాదాపు 45 యేళ్ళ పైన వయసున్నప్పటికీ ఆవిడకు ఇప్పటికీ వెంట్రులకు తెల్లబడలేదు.

మనమేమో వాళ్ళను,వీళ్ళను చూసి తలకి నూనె రాసుకుంటే జుట్టు రాలుతుందన్న అపోహలో నూనె రాసుకోవడం మానేసాం.ఇప్పుడేమో విదేశీ కంపెనీలు నూనె రాసుకోవడం మంచిది, మా మందార నూనె వాడండి, మీ జుట్టుకి చాలా మంచిది అని మనకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు.

మందారపువ్వులు ఎండువైనా,తాజావైనా వాడుకోవచ్చు.మందారపువ్వులు,కరివేపాకు,గోరింటాకు కడిగి తడి లేకుండా కొద్ది సేపు ఆరబెట్టాలి.

img_2822 (1)

తడి ఆరిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని ఇవన్నీ మునిగే వరకు కొబ్బరినూనె పోసి సన్న సెగ మీద మరిగించాలి.

img_2824 (1)

 

img_2829 (1)బాగా చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో పోసుకుని ఉంచుకోవచ్చు.

img_2832 (1)

 

హెర్బల్ షాంపూ

ముసలివాళ్ళకే తెల్లవెంట్రుకలు అన్న కాలం పొయినట్టుంది.15-20 యేళ్ళ పిల్లలకు కూడా తెల్లవెంట్రుకలు వస్తున్నాయి.వాటిని దాచుకోవడానికి రంగులు వాడమని చెప్పే కంపెనీలు ఒకవైపు.వాటిని వాడడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని చెప్పే పరిశోధకులు ఒకవైపు.ఏది నమ్మాలో తెలియని అయోమయం.ఇలా తెల్లబడడానికి కారణాలేంటా అంటే వత్తిడితో కూడిన జీవనవిధానం,ఆహారపు అలవాట్లు,కాలుష్యం,షాంపూలలో ఉండే రసాయనాలు ఇలా బోలెడు కారణాలు.

షాంపూలు హానికరం అని తెలిసీ కొనడం ఎందుకు అని షాంపూ వాడడం మానేశాను.ప్రత్యామ్నాయం ఏమిటా అని చాలా రకాల ప్రయోగాలే చేశాను.ఎక్కడ చదివినా ఏవోవేవో పొడులు కొని, రాత్రి కలిపి పొద్దున తలకు పెట్టుకోమ్మని చెప్పేవే ఉన్నాయి.అంత శ్రమ నచ్చలేదు.శ్రమ తక్కువతో పాటు మంచి ఫలితం,పైసా ఖర్చులేనిది కనిపెట్టి వాడడం మొదలు పెట్టా.మా పెరట్లో దొరికే వాటిల్తోనే షాంపూ తయారు చేసుకోవడం మొదలుపెట్టాను.

మందారం ఆకులు ఎక్కువ భాగం,కొద్దిగా గోరింటాకులు,ఇవన్నీ బాగా మెత్తగా రుబ్బుకోవడానికి వీలుగా ఒకటో రెండో అలోవెరా(కలబంద)ఆకులు.

img_2794 (1)

నేను గమనించినంతలో ఉట్టి ఆకులే అయితే బాగా మెత్తగా అవ్వవు.కలబంద గుజ్జులో ఉండే జిగురు వల్ల బాగా మెత్తగా రుబ్బుకోవడానికి వీలుగా ఉంటుంది.ముందుగా కలబంద లోపల ఉండే గుజ్జు తీసుకుని మిక్సీలో వేసుకోవాలి.

 

img_2796 (1)img_2797 (1)తరువాత ఆకులు కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి.

 

img_2798 (1)ఇలా రుబ్బుకున్న మందారం ముద్దను తలకు రాసుకుని,కొంచెం ఎండేవరకు ఉంచుకుని తలస్నానం చెస్తే సరిపోతుంది.మందారం పేస్ట్‌తోనే తల రుద్దేసుకోవాలి. వేరే షాంపూ ఏదీ వాడక్కర్లేదు.

img_2799 (1)

నేను గమనించినంతవరకు వెంట్రుకలు బాగా నల్లబడతాయి.జుట్టు రాలడం తగ్గుతుంది.జుట్టు బాగా పెరుగుతుంది కూడా.

ఈ మధ్య చాలా చోట్ల స్వదేశీ వస్తువులు వాడడండి,దేశ ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది అంటూ చాలామంది రాస్తున్నారు.స్వదేశీ వస్తువులు వాడితే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడంమీద పెద్ద అవగాహన లేదు కానీ,ఇంట్లో స్వంతంగా చేసుకునే ఉత్పత్తులు వాడడం వల్ల మన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని మాత్రం అర్థమయ్యింది.