చిన్నుల్లిపాయల పులుసు

ఈ చిన్నుల్లిపాయలు మా ప్రాంతంలో దొరకవు.మొన్నా మధ్య రిలయన్స్ మార్కెట్‌కి వెళ్తే కనపడ్డాయి.సరే ఏదో ఒక ప్రయోగం చేద్దాం అని కొనుక్కొచ్చాను. ఈ ఉల్లిపాయల్తో పులుసు పెట్టాను.బాగ వచ్చింది.

img_2663 (1)

కావలసిన పదార్థాలు
చిన్నుల్లిపాయలు – 30
వెల్లుల్లిపాయలు – 6-7
అల్లం – అంగుళం ముక్క
ధనియాల పొడి – 3/4 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2 టీ సూన్
మెంతి పొడి – చిటికెడు
బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
చింతపండు – చిన్న నిమ్మకాయంత
బెల్లం – చిన్న ముక్క
కారం – తినే కారానికి సరిపడా
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
నూనె – 1 టేబుల్ స్పూన్
పోపు సామాగ్రి

img_2664 (1)

పొయ్యి వెలిగించి మందపాటి పాత్రలో నూనె వేసి వేగాక,ఆవాలు,జీలకర్ర,మెంతులు,వెల్లుల్లి,ఎండుమిరపకాయలు,అల్లం ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మాడకుండా వేయించాలి.ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసి కొంచెం సేపు వేపాలి.

img_2665 (1)

ఇప్పుడు కారం,పసుపు,ధనియాల పొడి,జీలకర్ర పొడి,మెంతి పొడి కూడా వేసి బాగా కలపాలి.

img_2666 (1)

చింతపండును తగినన్ని నీళ్ళలో నానబట్టి రసం తీసి ఉంచుకోవాలి.మసాల పొడులన్నీ వేశాక మాడకుండా వేయించి అందులో చింతపండు రసం,నీళ్ళు పోసి ఉడికించాలి.కొంచెం ఉడికాక ఉప్పు,బెల్లం ముక్క కూడా వేసి ఉల్లిపాయలు ఉడకనివ్వాలి.

img_2667 (1)

పులుసు చిక్కబడ్డాక దింపెయ్యాలి.

img_2668 (1)

 

వ్యాఖ్యానించండి